త‌ల్లి పాత్ర‌లో క‌నిపించేందుకు సై అన్న ప్రియాంక చోప్రా..!

Tue,May 22, 2018 09:12 AM
PRIYANKA PLAYS  MOTHER ROLE IN BOLLYWOOD MOVIE

ప్ర‌స్తుతం హాలీవుడ్‌లో త‌న హ‌వా చూపిస్తున్న ప్రియాంక చోప్రా త్వ‌ర‌లో బాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్ చేయ‌నుంది. స‌ల్మాన్ స‌ర‌స‌న భ‌ర‌త్ అనే చిత్రం చేయ‌నున్న ఈ అమ్మ‌డు ఆ త‌ర్వాత సోనాలి బోస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నుంది. ఇది ‘ఇమ్యునోడెఫిషియన్సీ’ వ్యాధితో (రోగ నిరోదక శక్తి లోపించడం) మృతి చెందిన 18 ఏళ్ల మ‌హిళ అయేషా చౌద‌రి జీవిత నేప‌థ్యంలో రూపొంద‌నుంది. ఈ చిత్రంలో అయేషా పాత్ర‌లో దంగ‌ల్ ఫేం జైరా వ‌సీమ్ న‌టించ‌నుండగా, ఆమె త‌ల్లి పాత్ర‌లో ప్రియాంక చోప్రా న‌టిస్తార‌ట‌. ఇక ప్రియాంక భ‌ర్తగా అభిషేక్ బ‌చ్చ‌న్ న‌టిస్తాడ‌ని స‌మాచారం. వ‌చ్చే ఏడాది చివ‌రిలో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రంకి సంబంధించిన పూర్తి వివ‌రాలు అతి త్వ‌ర‌లోనే ఎనౌన్స్ చేయ‌నున్నారు. గ్లోబ‌ల్ భామ ప్రియాంక ప్ర‌స్తుతం హాలీవుడ్‌లో క్వాంటికో సిరీస్‌తో పాటు ‘ఎ కిడ్‌ లైక్‌ జేక్‌’, ‘ఇజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ చిత్రాల‌తో బిజీగా ఉంది.

1729
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles