మ‌జిలీ నుండి ప్రియ‌తమా.. వీడియో సాంగ్ విడుద‌ల‌

Thu,April 25, 2019 12:26 PM
Priyathama Priyathama Full Video Song

వివాహ బంధం త‌ర్వాత నాగ చైతన్య, సమంత తొలిసారి క‌లిసి న‌టించిన చిత్రం మజిలీ. శివనిర్వాణ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యం సాధించింది. త‌క్కువ టైంలోనే మంచి వ‌సూళ్ళు సాధించిన ఈ చిత్రానికి మ‌రింత ఆద‌ర‌ణ పెరిగేలా మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. కొద్ది రోజులుగా చిత్రం నుండి తొల‌గించిన కొన్ని స‌న్నివేశాల‌ని వీడియోలుగా విడుద‌ల చేసిన టీం తాజాగా మ‌జిలీ సూప‌ర్ హిట్ సాంగ్ ప్రియ‌త‌మా.. ప్రియ‌త‌మా అనే పాట వీడియో విడుద‌ల చేశారు. చిన్మ‌యి ఆల‌పించిన ఈ సాంగ్‌లో స‌మంత‌.. చైతూ ప్రేమ‌లో ఎలా ప‌డింద‌నేది చూపించారు. గోపిసుంద‌ర్ స‌మ‌కూర్చిన స్వ‌రాలకి చిన్మ‌యి గాత్రం తోడు కావ‌డంతో ఈ సాంగ్‌కి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాకి ప్రియ‌త‌మా.. ప్రియ‌త‌మా పాట ప్రాధాన్యం చాలా ఉంద‌ని మేక‌ర్స్ చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 5న విడుద‌ల అయిన ఈ చిత్రంలో రావు రమేశ్, పోసాని కృష్ణ మురళి, రాజశ్రీ నాయర్ ఇతర పాత్రల్లో నటించారు.

1505
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles