చెర్రీ మూవీపై వ‌స్తున్న‌ పుకార్ల‌ని కొట్టేసిన నిర్మాణ సంస్థ‌

Wed,October 31, 2018 01:36 PM
production house gives clarity on rumors

రంగ‌స్థ‌లం చిత్రంతో భారీ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం బోయపాటి ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. దీపావ‌ళికి రిలీజ్ అవుతుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ఇక మూవీ వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతుంద‌ని నిర్మాణ సంస్థ గ‌తంలోనే ప్ర‌క‌టించిన‌ప్ప‌టికి ఈ సినిమా రిలీజ్ వాయిదా ప‌డుతుందంటూ పుకార్లు షికారు చేశాయి. దీనిపై డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఆర్‌సీ 12 చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికే రిలీజ్ అవుతుంద‌ని ట్వీట్‌లో తెలిపింది. అలానే మూవీ ఫ‌స్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తామ‌నే విష‌యం అతి త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌ని అన్నారు. భ‌ర‌త్ అనే నేను చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. స్నేహ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు . వివేక్‌ ఒబెరాయ్ ఈ సినిమాలో విల‌న్‌గా క‌నిపిస్తాడ‌ని అంటున్నారు . ఇక‌ చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ ఫేం), నవీన్‌ చంద్ర లు నటిస్తున్నారు. విన‌య విధేయ రామ అనే టైటిల్‌ని చిత్రానికి ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తుంది.



2083
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles