బిగ్ బాస్ ఆదేశాలు బేఖాత‌రు.. నీ గేమ్ నువ్వే ఆడుకో అంటూ వార్నింగ్

Thu,September 12, 2019 08:19 AM
Punarnavi is hell bent on not serving the punishment

52వ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కి ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం అనే టాస్క్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ టాస్క్‌లో కొంద‌రు దెయ్యాలుగా ఉంటే ఇంకొంద‌రు మ‌నుషులుగా గేమ్‌లో పాల్గొన్నారు. అయితే టాస్క్‌లో భాగంగా దెయ్యంగా ఉన్న శిల్పా చ‌క్ర‌వ‌ర్తి మ‌నిషిగా ఉన్న పున‌ర్న‌విని తీసుకొచ్చి స్విమ్మింగ్ ఫూల్‌లో పడేసింది. దీన్ని తప్పుపడుతూ.. ఇలాంటి బుల్ షిట్ గేమ్‌లు ఇవ్వొద్దు అంటూ బిగ్ బాస్‌పై మంగ‌ళ‌వారం ఎపిసోడ్‌లో నిప్పులు చెరిగింది పునర్న‌వి.

బుధ‌వారం ఎపిసోడ్‌లోను త‌న ఆవేశాన్ని చూపిస్తూ రెచ్చిపోయింది పున్నూ. వాళ్ళ ఏం చేసిన నోరు మెద‌పకూడ‌దు అంటే అదేమి టాస్క్‌. ఇలాంటి ముష్టి టాస్క్‌లు మాకు ఇవ్వొద్దు. ఇలాంటి గేమ్స్ మీరే ఆడుకోండి. బిగ్ బాస్ అనే వాడు ఎప్పుడు క‌రెక్ట్ కాదు. మేం వంద శాతం ఎఫ‌ర్ట్ పెడితే స‌డెన్‌గా ర‌ద్దు చేస్తారు. ఎమోష‌న‌ల్ డ్రైన్ చేయడం కరెక్ట్ కాదు. కొంచెం సెన్స్ ఉన్న టాస్క్‌లు ఇవ్వండి. నా రియాక్షన్ తప్పైతే బయటకు పోతా. టాస్క్ అన్నప్పుడు క్లియర్‌గా ఇవ్వాలి. క్లారిటీ ఉండాలి.. సిల్లీ గేమ్స్ ఇవ్వకు’ అంటూ బిగ్ బాస్‌ని ఏకి పారేసింది పున‌ర్న‌వి.

మంగ‌ళవారం రోజు దెయ్యాలుగా ఉన్న‌వారంద‌రు వారి టాస్క్‌ని స‌క్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయ‌డంతో, దెయ్యాలు మ‌నుషులుగా, మ‌నుషులు దెయ్యాలుగా మారారు. బుధ‌వారం ఎపిసోడ్‌లో దెయ్యాలుగా శ్రీముఖి, పున‌ర్న‌వి, మ‌హేష్‌, వ‌రుణ్ సందేశ్, ర‌వికృష్ణ‌ ఉండ‌గా, వారు టాస్క్‌ని మేం చేయ‌లేమ‌ని బిగ్ బాస్‌కి తేల్చి చెప్పారు. టాస్క్ నియ‌మాల‌ని స‌రిగ్గా పాటించని శ్రీముఖి, పున‌ర్న‌వి, మ‌హేష్‌ల‌కి బిగ్ బాస్ ప‌నిష్మెంట్ ఇచ్చారు. మోస్ట్ వ‌ర‌స్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్‌గా వారి ముగ్గురిని ప్ర‌క‌టిస్తూ శ్రీముఖి, పునర్నవి, మహేష్‌లకు షూ పాలిష్ శిక్ష విధించారు.

గార్డెన్ ఏరియాలో ఉన్న షూస్‌తో పాటు ఇంటి స‌భ్యుల షూస్‌ని కూడా ముగ్గురు పాలిష్ చేయాల‌ని బిగ్ బాస్ ఆదేశించ‌గా, శ్రీముఖి ఆ ప‌ని చేసేందుకు ముందుకు వ‌చ్చింది. కాని పున‌ర్న‌వి, మ‌హేష్‌లు ఇలాంటి ప‌నులు మేం చేయ‌డానికి ఇక్క‌డ‌కి రాలేదంటూ మోండికేసి కూర్చున్నారు. మిగ‌తా ఇంటిస‌భ్యులు వీరిద్ద‌రిని స‌ముదాయించే ప్ర‌య‌త్నం చేసిన ఓ మెట్టు కూడా దిగి రాలేదు. చివ‌ర‌లో మ‌హేష్ కొంత కాంప్ర‌మైజ్ అయి టాస్క్ లో పాల్గొన్నాడు. పున‌ర్నవి మాత్రం నేను బ‌య‌ట‌కి అయిన పోతా క‌ని ఇలాంటి చీప్ టాస్క్‌లు చేయ‌నంటూ బిగ్ బాస్ ఆదేశాల‌ని బేఖాత‌రు చేసింది. అయితే శిక్ష పాటించ‌క‌పోతే వ‌చ్చే వారం డైరెక్ట్‌గా నామినేట్ అవుతావు అని బిగ్ బాస్ చెప్పిన తాను చేయ‌న‌ని మొండికేసింది.

షూ పాలిష్ శిక్ష వేయడంపై త‌న వాద‌న వినిపించిన పున‌ర్న‌వి అన్ని దెబ్బలు తిన్న నాకు శిక్ష ఎలా వేస్తారు అని బిగ్‌బాస్‌ని ప్ర‌శ్నించింది. నేను షూ పాలిష్ టాస్క్ చేయ‌ను. ఏం చేస్తారో చేసుకోండి. చెత్త టాస్క్‌లు ఇస్తే నేను ఎందుకు బాధ్యత వహించాలి. నేను ఇప్పుడు తగ్గితే ఇంటి నుండి బయటకు వెళ్లినా నేను డౌన్ అయినట్టే. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇది చేయను. నేను దెబ్బలు తగిలించుకుని గేమ్ ఆడితే చెత్త పెర్ఫామెన్స్ అని ఎలా అంటారు అని కన్నీళ్లు పెట్టుకుంది పునర్నవి. మ‌రో వైపు మ‌హేష్ ఈ రోజు షూస్ పాలిష్ చేయ‌మంటారు రేపు చెడ్డీలు ఉత‌క‌మంటారు. ఈ ప‌ని చేయ‌డానికా మేం ఇక్క‌డికి వ‌చ్చింది. మరీ అంత చీప్‌గా కనిపిస్తున్నామా? పిచ్చోళ్ల మాదిరి కనిపిస్తున్నామా? అంటూ ఫైర్ అయ్యాడు.

మొత్తానికి బిగ్ బాస్ ఆదేశాల‌ని ఏ మాత్రం లెక్క చేయ‌కుండా ఆయ‌న‌పై నిప్పులు చెరిగిన పున‌ర్న‌వి రానున్న రోజుల‌లో ఏదైన శిక్ష అనుభ‌విస్తుందా అనేది చూడాలి. అయితే పున‌ర్న‌వి ప్ర‌వ‌ర్త‌న‌పై నెటిజ‌న్స్ భిన్న ర‌కాలుగా స్పందిస్తున్నారు. అలీ చేసిన‌ప్పుడు అంత‌గా త‌ప్పు ప‌ట్టిన ఆమె ఇప్పుడు త‌న వ‌ర‌కు వ‌చ్చే స‌రికి చాలా తెలివిగా ప్ర‌వ‌ర్తిస్తుంది. పున‌ర్న‌విది గేమ్ కానే కాదు అంటూ నెటిజ‌న్స్ ఆమెపై ఫుల్ ఫైర్ అవుతున్నారు.

2349
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles