బిగ్‌బాస్‌ నుంచి పునర్నవి ఔట్‌..

Sun,October 6, 2019 11:42 PM

హైదరాబాద్‌: బుల్లితెర తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌-3 నుంచి ఈ వారం పునర్నవి ఎలిమినేట్‌ అయింది. ఈ షోకు టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారన్న విషయం తెలిసిందే. షో మొదటి నుంచి తోటి కంటెస్టెంట్లకు గట్టి పోటీనిచ్చిన పున్ను ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్‌ వీడుతున్నట్లు హోస్ట్‌ నాగార్జున తెలిపారు. ఈ వారం నామినేషన్‌ లిస్ట్‌లో పునర్నవితో పాటు రాహుల్‌ సిప్లిగంజ్‌, వరుణ్‌ సందేశ్‌, మహేశ్‌ విట్టా ఉన్నారు. వీరిలో పునర్నవికి ప్రేక్షకులు తక్కువ ఓట్లు వేయడంతో ఆమె ఎలిమినేట్‌ అయింది. మహేష్‌ తృటిలో ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకున్నాడు. సీజన్‌ ముగియడానికి దగ్గర పడుతుండడంతో పోటీ తీవ్రమైంది. గట్టి పోటీ దారులంతా షోనుంచి బయటకు వెళ్తుండడంతో కంటెస్టెంట్లలో ఉత్కంఠ నెలకొంది.


పునర్నవి షోలో మొదటి నుంచి బలమైన కంటెస్టెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ షోలో సింగర్‌ రాహుల్‌ పునర్నవితో కాస్తంత ప్రేమాయణం నడిపి షోను రక్తి కట్టించాడు. కాగా, పున్ను ఎలిమినేషన్‌ సందర్భంలో రాహుల్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తన కోసం ఏమై పోయావే.. అనే పాట పాడుతూ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.

13742
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles