స్పెష‌ల్ రోల్ కోసం నాలుగు కోట్లా ?

Fri,October 27, 2017 01:18 PM

అక్కినేని నట వారసుడు నాగ చైతన్య ఇటీవ‌లే ఓ ఇంటివాడ‌య్యాడు. ప్ర‌స్తుతం స‌మంత‌తో హ‌నీమూన్ ట్రిప్‌కి వెళ్లిన చైతూ త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌కి రానున్నాడు. ఆ త‌ర్వాత‌ చందూ మొండేటి దర్శకత్వంలో చైతూ ఓ చిత్రాన్ని చేయనున్నాడు. ఈ చిత్రానికి మహా భారతంలో అర్జునుడి బిరుదు అయిన సవ్యసాచి ని టైటిల్ గా ఖరారు చేశారు. చైతూకి ప్రేమమ్ లాంటి హిట్ ఇచ్చిన చందూ మొండేటి టాలీవుడ్ లో ఎవరూ టచ్ చేయని కథతో ఈ సినిమా చేసేందుకు సిద్దమయ్యాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రాన్ని తెలుగులోనే కాక త‌మిళంలోను విడుద‌ల చేయాల‌ని భావిస్తుండ‌గా, ప్ర‌త్యేక పాత్ర కోసం స్టైలిష్ హీరో మాధ‌వ‌న్‌ని తీసుకోవాల‌ని భావించార‌ట‌. ఆయ‌న‌తో చ‌ర్చ‌లు కూడా జ‌రిపార‌ట‌. నాలుగు కోట్ల పారితోషికం తీసుకొని మాధ‌వ‌న్ ఆ పాత్ర పోషించేందుకు సిద్ధ‌మ‌య్యాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. స్పెషల్ పాత్ర కోసం 4 కోట్లు ఇచ్చేందుకు నిర్మాత‌లు సిద్ధ‌మ‌య్యారా అని సినీ అభిమానులు ఆశ్చ‌ర్యపోతున్నారు. మరి ఫిలిం న‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వార్త‌కి సంబంధించి పూర్తి క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

1859
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles