నా భర్తను నేనే చంపేశా..

Tue,November 5, 2019 06:18 PM


సత్యదేవ్, ఈషా రెబ్బా కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ట్రైలర్ ను డైరెక్టర్ రాఘవేంద్రరావు విడుదల చేశారు. నా లైఫ్ లో ఏదైనా అదృష్టం ఉందంటే అది నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడమేనంటూ ఈషాతో సత్యదేవ్ చెప్పే డైలాగ్స్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఓ హత్య ఘటనపై దర్యాప్తు జరుగుతుండగా..నా భర్తను నేనే చంపేశానంటూ ఈషా పోలీసులతో చెప్పే మాటలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే ట్రైలర్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను కలిగిస్తోంది. ముస్కాన్ సేతి, గణేశ్ వెంకట్రామన్, కృష్ణభగవాన్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటించారు. రఘుకుంచె ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

3893
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles