వెంకీతో రాశీఖన్నా..ఫొటో వైరల్

Mon,August 26, 2019 05:31 PM
Raashi Khanna fan girl moment with Venkatesh

టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ మల్టీస్టారర్ చిత్రం "వెంకీమామ' లో నటిస్తోన్న విషయం తెలిసిందే. నాగచైతన్య, వెంకీ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాలో రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాశీఖన్నాకు వెంకటేశ్ అంటే చాలా అభిమానం. తన ఫేవరెట్ హీరో వెంకీతో కలిసి నటిస్తున్న రాశీఖన్నా ఆనందంలో ఎగిరిగంతులేస్తోంది. రాశీఖన్నా ఇటీవల వెంకీమామ సినిమా సెట్స్‌లో వెంకీని హగ్ చేసుకుని ఫొటో దిగింది. తన అభిమాన నటుడితో రాశీఖన్నా దిగిన ఫొటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేశ్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వెంకీమామ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు.

5250
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles