మెగా హీరో స‌ర‌స‌న క‌న్న‌డ బ్యూటీ

Sat,November 16, 2019 07:55 AM

క‌ళ్యాణ్ దేవ్ హీరోగా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో పులివాసు సూప‌ర్ మ‌చ్చి అనే సినిమా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంతో వాసు ద‌ర్శ‌కుడిగా పరిచయం అవుతున్నాడు. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళీ, ప్రగతి కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్బంగా చిత్ర ఫ‌స్ట్ లుక్‌తో పాటు టైటిల్ రివీల్ చేశారు. ఈ నెల 22 నుండి చిత్ర కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుండ‌గా, ఈ మూవీలో క‌ళ్యాణ్ స‌ర‌స‌న క‌న్న‌డ భామ ర‌చితారామ్ న‌టిస్తున్న‌ట్టు మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు.1699
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles