కొలంబో బ్లాస్ట్‌ నుండి తృటిలో త‌ప్పించుకున్న సీనియ‌ర్ న‌టి

Sun,April 21, 2019 12:50 PM
Radikaa Sarathkumar escapes from colombo bomb blast

ఈ రోజు ఉదయం 8: 30 గంటల ప్రాంతంలో కొలంబో సహా పలు చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించిన సంగ‌తి తెలిసిందే. కొలంబోలోని సెయింట్‌ ఆంటోనీ, నెగోంబో పట్టణంలోని సెయింట్‌ సెబాస్టియన్‌, బాట్టికలోవాలోని మరో చర్చితో పాటు శాంగ్రిలా హోటల్‌, సిన్నామన్‌ గ్రాండ్‌ హోటల్‌, కింగ్స్‌బరి హోటళ్లలో పేలుళ్లు సంభవించాయి. ఉగ్రదాడిపై భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది . ప్ర‌స్తుతం కొలంబోలో హై అలర్ట్ కొన‌సాగుతుంది. బాంబు పేలుళ్లలో 137 మంది మృతి చెందగా 200 మంది తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తుంది. ఈస్టర్‌ సండే సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులనే లక్ష్యంగా చేసుకొని టెర్రరిస్టులు ఈ దాడులకు పాల్పడ్డారు . అయితే కొలంబోలోని సిన్నామన్‌ గ్రాండ్‌ హోటల్ లో బ‌స చేసిన రాధికా ఈ ఘటన జరిగే కొద్దీ నిమిషాల ముందు ఈ హెటల్ ను ఖాళీ చేసి వెళ్లిపోయారట‌. దాంతో ఆమె పెద్ద ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్నారు.ఈ ఘ‌ట‌న త‌న‌కి షాకింగ్‌గా ఉంద‌ని, ఇప్ప‌టికి న‌మ్మ‌లేక‌పోతున్నానంటూ రాధిక త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది.


4392
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles