మ‌ళ్ళీ ల‌క్ష్మీ బాంబ్ టీంతో క‌లిసిన లారెన్స్

Sun,June 2, 2019 08:04 AM

ఎట్ట‌కేల‌కి నిర్మాత‌ల‌తో లారెన్స్ జ‌రిపిన‌ చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మ‌య్యాయి. హిందీలో కాంచ‌న రీమేక్‌గా తెర‌కెక్కుతున్న ల‌క్ష్మీ బాంబ్‌ని రాఘ‌వ లారెన్స్ డైరెక్ట్ చేయ‌నున్నాడు. అక్ష‌య్ కుమార్, నిర్మాత ష‌బీనా ఖాన్ త‌న‌ని అర్ధం చేసుకోవ‌డంతో మ‌ళ్ళీ ల‌క్ష్మీ బాంబ్ టీంతో క‌ల‌వ‌గ‌లిగాను. మీ అంద‌రి కోరిక మేర‌కు ల‌క్ష్మీ బాంబ్ చిత్రాన్ని నేనే తెర‌కెక్కించ‌నున్నాను. చాలా ఆనందంగా ఉంది అని లారెన్స్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆ మ‌ధ్య ల‌క్ష్మీ బాంబ్ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ని త‌న‌కి తెలియ‌కుండా విడుద‌ల చేసార‌ని ఆవేద‌న చెందిన లారెన్స్ ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. ఆత్మ‌గౌర‌వం అనేది మ‌నిషికి చాలా ముఖ్యం. అది లేని చోట ప‌నిచేయడం క‌ష్టం. అందుకే నేను కాంచ‌న రీమేక్ చిత్రం నుండి త‌ప్పుకుంటున్నాను అని తెలిపారు. ల‌క్ష్మీ బాంబ్‌లో అక్ష‌య్ స‌ర‌స‌న కియారా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తుంది.2200
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles