మీటింగ్ త‌ర్వాత సినిమా చేయాలా వ‌ద్దా అని ఆలోచిస్తా

Sun,May 26, 2019 07:16 AM
Raghava Lawrence clarity on Akshay Kumars Laxmmi Bomb

న‌టుడు, కొరియోగ్రాఫ‌ర్, ద‌ర్శ‌కుడిగా రాణిస్తున్న లారెన్స్ కాంచ‌న చిత్రానికి రీమేక్‌గా ల‌క్ష్మీ బాంబ్ అనే చిత్రం చేయాల‌నుకున్న సంగ‌తి తెలిసిందే. అక్ష‌య్ ప్ర‌ధాన పాత్ర‌లో ఈ చిత్రం రూపొందుతుండగా, త‌న‌కి తెలియ‌కుండా సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కావ‌డంతో ఆవేద‌న చెందిన లారెన్స్ ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించాడు. ఆత్మ‌గౌర‌వం అనేది మ‌నిషికి చాలా ముఖ్యం. అది లేని చోట ప‌నిచేయడం క‌ష్టం. అందుకే నేను కాంచ‌న రీమేక్ చిత్రం నుండి త‌ప్పుకుంటున్నాను అని తెలిపారు. అయితే త‌న అభిమానులు, అక్ష‌య్ అభిమానులు కాంచ‌న రీమేక్ చేయాల‌ని కోరుతున్నార‌ని, వారి ప్రేమ‌కి నేను ధ‌న్యుడిని అని లారెన్స్ త‌న తాజా ట్వీట్‌లో తెలిపారు.

కాంచ‌న రీమేక్ చిత్రం చేసేందుకు నేను చాలా ఎగ్జైటింగ్‌గా ఫీల‌య్యాను. ఎన్నాళ్ళ నుండో ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను. ఈ చిత్రం కోసం విలువైన స‌మ‌యం కేటాయించాను. ఈ రోజు చిత్ర నిర్మాత‌లు నన్ను క‌లిసేందుకు చెన్నై వ‌స్తున్నారు. వారితో మీటింగ్ త‌ర్వాత‌ చిత్రాన్ని తెర‌కెక్కించాలా వ‌ద్దా అనేది నిర్ణ‌యిస్తాను. అంతా వారి చేతుల్లోనే ఉంది. నా జాబ్ పై నాకు గౌర‌వం ఉంది. అంతా మంచే జ‌రుగుతుందని లారెన్స్ పేర్కొన్నారు. ల‌క్ష్మీ బాంబ్‌లో అక్ష‌య్ స‌ర‌స‌న కియారా అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

4102
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles