షాకింగ్‌: కాంచ‌న రీమేక్ నుండి లారెన్స్ ఔట్

Sun,May 19, 2019 08:21 AM

2011లో తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌లైన కాంచ‌న చిత్రానికి రీమేక్‌గా హిందీలో ల‌క్ష్మీ బాంబ్ అనే చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. అక్ష‌య్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న‌ ఈ చిత్రాన్ని లారెన్స్ తెర‌కెక్కిస్తున్నాడు. రీసెంట్‌గా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో అక్ష‌య్ క‌ళ్ళ‌కి కాజ‌ల్ పెట్టుకున్న‌ట్టుగా డిజైన్ చేశారు. అయితే త‌న ప్ర‌మేయం లేకుండా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌డంతో ఆవేద‌న చెందిన లారెన్స్ ఈ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంటున్నట్టు ప్ర‌క‌టించారు.


డియ‌ర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్.. ప్ర‌పంచంలో డ‌బ్బు, ఫేం ఎంత ఉన్నా ఓ మ‌నిషిని అంచ‌నా వేసేది ఆత్మ గౌరవం. ఇది మ‌నిషికి చాలా ముఖ్యం. అది లేని చోట ప‌నిచేయడం క‌ష్టం. అందుకే నేను కాంచ‌న రీమేక్ చిత్రం నుండి త‌ప్పుకుంటున్నాను. నేను ఈ ప్రాజెక్టు నుండి త‌ప్పుకోవ‌డానికి చాలా రీజ‌న్స్ ఉన్నాయి. కాని అవి ఇప్పుడు చెప్ప‌ద‌ల‌చుకోలేదు. ఒక‌టి మాత్రం చెబుతున్నాను. చిత్ర ఫ‌స్ట్ లుక్ నా ప్ర‌మేయం లేకుండా రిలీజైంది. విడుద‌లైన విష‌యం వేరే వ్య‌క్తి చెబితే త‌ప్ప నాకు తెలియ‌దు. ఫ‌స్ట్ లుక్ డిజైన్ నాకు అస్స‌లు న‌చ్చ‌లేదు. ద‌ర్శ‌కుడి ప్ర‌మేయం లేకుండా ఫ‌స్ట్ లుక్ బ‌య‌ట‌కి వ‌స్తే ఎంత పెయిన్ ఉంటుంది. అక్ష‌య్ కుమార్ సార్ పైన ఉన్న అభిమానం వ‌ల‌న చిత్ర స్క్రిప్ట్‌ని వారికి అందిస్తాను. వేరే డైరెక్ట‌ర్‌తో వారికి న‌చ్చిన విధంగా మూవీని రూపొందిస్తారు. చిత్ర బృందానికి నా శుభాకాంక్ష‌లు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను అని లారెన్స్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ల‌క్ష్మీ బాంబ్‌లో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండ‌గా, ఈ చిత్రానికి కొత్త దర్శకుడు ఎవరనేది త్వరలోనే వెల్లడించనున్నారు చిత్ర నిర్మాతలు.3758
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles