70 ఏళ్ళ అనుభ‌వం ఉన్న న‌టిగా స‌మంత న‌టించింది

Thu,June 20, 2019 11:15 AM

మంచి క‌థ‌ల‌ని ఎంచుకుంటూ వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న స‌మంత తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో ‘ఓ బేబి’ సినిమా చేసిన విష‌యం తెలిసిందే. జులై 5న విడుద‌ల కానున్న ఈ చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేశారు మేక‌ర్స్‌. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో స‌మంత స్వాతి అనే క్యారెక్ట‌ర్‌లో క‌నిపించి మెప్పించింది. ఫ‌న్నీతో పాటు ఎమోష‌న‌ల్‌గా ఉన్న ట్రైల‌ర్ అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో మూవీతో పాటు స‌మంతపై ప్ర‌శంస‌లు కురిపించాడు. ఓ బేబి సినిమా చూసాను. సినిమా చాలా కొత్తగా ఎమోషనల్ గా ఉంది. స‌మంత‌ 70 ఏళ్ళ బామ్మగా చేసింది అనడం కన్నా 70 ఏళ్ళ అనుభవం ఉన్న నటి గా చేసింది. ఈ సినిమా తనకి ఇంకా పెద్ద పేరు తీసుకొస్తుంది అని ఆయ‌న పేర్కొన్నారు .


ఓ బేబి చిత్రం కొరియాలో హిట్టైన ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా తెర‌కెక్కింది. ఓ సెలూన్ కు వెళ్లి బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత అనుకోకుండా ఓ పెద్దావిడా.. పాతికేళ్ల భామ‌గా మారిపోతుంది. అదెలా సాధ్య‌మైంది అనేది అస‌లు క‌థ‌. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించారు. స‌మంత వృద్ధురాల‌య్యాక ప్ర‌ముఖ న‌టి ల‌క్ష్మీ పాత్ర‌లో క‌నిపిస్తారు. రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప్ర‌గ‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. నాగశౌర్య కీలక పాత్రను పోషించారు.

2642
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles