డివైడ‌ర్‌ని ఢీకొట్టిన యంగ్ హీరో కారు

Tue,August 20, 2019 09:51 AM
Raj Tarun  car met with an accident

కొద్ది రోజులుగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న రాజ్ త‌రుణ్ ప్ర‌స్తుతం దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్‌లో ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు విజ‌య్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేసేందుకు సిద్ద‌మ‌య్యాడు. స‌త్య సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కెకె రాధామోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఇటీవ‌ల త‌న పెళ్లి మేట‌ర్‌తో వార్త‌ల‌లోకి ఎక్కిన రాజ్ త‌రుణ్ తాజాగా యాక్సిడెంట్‌తో హాట్ టాపిక్‌గా మారాడు.

రాజ్ త‌రుణ్ ప్ర‌యాణిస్తున్న కారు నార్సింగ్‌ సమీపంలో అల్కాపూర్‌ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదానికి గురైంది. మంగళవారం తెల్లవారు జామున రాజ్ త‌రుణ్‌ కారు డివైడర్‌ను డీకొట్టగా, ఈ ప్రమాదంలో ఆయ‌న‌కి చిన్న‌పాటి గాయాలు అయిన‌ట్టు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన వేరే కారులో వెళ్లిపోయినట్టు స్థానికులు చెప్తున్నారు. అయితే రాజ్ త‌రుణ్ త‌న కారు అక్క‌డే వదిలేసి వెళ్ల‌డంతో ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

2334
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles