ప్ర‌మాద స‌మ‌యంలో కారు న‌డిపింది నేనే: రాజ్ త‌రుణ్‌

Wed,August 21, 2019 12:39 PM
raj tarun opens on narsing car incident

మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపూర్‌ టౌన్‌షిప్‌కి వంద అడుగుల రహదారి మలుపువద్ద గతంలో ఒక కారు ఢీకొని నుజ్జునుజ్జయిన విషయం తెలిసిందే. సరిగ్గా అదే ప్రాంతంలో సోమవారం(ఆగ‌స్ట్ 18) రాత్రి ఓ కారు అతివేగంగా వచ్చి ఖాళీ ప్లాటు గోడను ఢీకొట్టి నిలిచిపోయింది.. వేగంగా వచ్చి ఢీకొనడంతో గోడ కూలిపోయింది. ఘటనాస్థలం నుంచి ఒక వ్యక్తి కారును వదిలేసి పారిపోతున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించాయి. ఆ వ్య‌క్తి రాజ్ త‌రుణ్ అని స్థానికులు అనుమానించారు. అయితే సీసీ టీవీ ఫుటేజ్ ప‌రిశీలించిన పోలీసులు ఆ వ్య‌క్తి రాజ్ త‌రుణ్ అని తేల్చేశారు. సుమోటో కేసుగా న‌మోదు చేసిన పోలీసులు రాజ్ త‌రుణ్ అజ్ఞాతంలో ఉన్నాడ‌ని ఆయ‌న కోసం అన్వేషిస్తున్న‌ట్టు కొద్ది సేప‌టి క్రితం తెలియ‌జేశారు.

రాజ్‌త‌రుణ్‌కి సంబంధించి సోష‌ల్ మీడియాలో జోరుగా చర్చ న‌డుస్తున్న క్ర‌మంలో ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించాడు. ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత నేను సేఫ్‌గా ఉన్నానా లేదా అని తెలుసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన ప్ర‌తి ఒక్క‌రికి నా హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. గ‌త మూడు నెల‌లుగా నార్సింగ్ స‌ర్కిల్‌లో చాలా యాక్సిడెంట్స్ జ‌ర‌గుతూ వ‌చ్చాయి. ఆ స్పాట్ నుండే నేను వ‌స్తుండ‌గా, హఠాత్తుగా వచ్చిన మలుపు గమనించక పోవడం వలన స‌డెన్‌గా కారు స్టీరింగ్‌ని కుడివైపుకి తిప్పాను. దీంతో కారు అదుపుత‌ప్పి రోడ్డు ప‌క్క‌న గోడ‌ని ఢీకొంది. ఆ స‌మ‌యంలో నా చెవులు బ్లాక్ అయ్యాయి. క‌ళ్ళు బ‌య‌ర్లు క‌మ్మాయి. గుండె వేగం పెరిగింది. సీటు బెల్ట్ పెట్టుకోవ‌డం వ‌ల‌న నాకు ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేదు. హఠాత్ పరిణామంతో షాక్ కి గురైన నేను, తేరుకొని పరుగున నార్సింగ్ సర్కిల్ నుండి ఇంటికి చేరాను .ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాను. కొద్ది రోజుల‌లో నా పనుల‌తో బిజీ అవుతాను. మీ ప్రేమ‌కి నేను ధ‌న్యుడిని అని పేర్కొన్నారు యంగ్ హీరో రాజ్ త‌రుణ్‌.

8048
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles