ఆర్ఆర్ఆర్ మూవీ విష‌యాలు వెల్ల‌డించిన జ‌క్క‌న్న‌

Thu,March 14, 2019 12:21 PM
rajamouli gives clarity on rrr

టాలీవుడ్ టాప్ హీరోలు రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రానికి సంబంధించి అభిమానుల‌లో ఎన్నో అనుమానాలు నెల‌కొని ఉండ‌గా, వాటికి తాజాగా క్లారిటీ ఇచ్చాడు జ‌క్క‌న్న. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో చిత్రానికి సంబంధించిన ముఖ్య విష‌యాలు వెల్ల‌డించాడు రాజ‌మౌళి. అంద‌రి కోరిక మేరకు చిత్రానికి ఆర్ఆర్ఆర్ అనే టైటిల్‌నే పెట్టాల‌ని అనుకున్నాం. ఇక ఈ చిత్ర క‌థ 1920లో ఉత్తర భారతదేశంలో జరిగే కథగా తెర‌కెక్కించ‌నున్నాను. ఇందులో యంగ్ వ‌ర్షెన్ అల్లూరి సీతారామ రాజుగా చ‌ర‌ణ్‌, యంగ్ వ‌ర్ష‌న్ కొమ‌రం భీంగా ఎన్టీఆర్ న‌టించ‌నున్నాడు. స్వాతంత్య్ర‌ సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంలు ఒకే సమయంలో కలిసి పోరాటం చేసి ఉంటే ఎలా ఉండేది అన్న ఫిక్షనల్‌ పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా వెల్లడించారు రాజ‌మౌళి.


350 భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌ణ్ ముఖ్య పాత్ర పోషించ‌నున్నాడు. ఆయ‌న పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో వ‌చ్చేది ఉండ‌గా, ఇది ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటుందట‌. ఇక చ‌ర‌ణ్ స‌ర‌స‌న అలియా భ‌ట్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, ఎన్టీఆర్‌కు జోడిగా విదేశీ భామ డైసీ ఎడ్జ‌ర్ జోన్స్‌ జోడి క‌ట్టింది. సముద్రఖ‌ని కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. చారిత్ర‌క ప‌రిశోధ‌న‌ల వ‌లన సినిమా ఆల‌స్యం అయింద‌ని రాజ‌మౌళి అన్నారు. జూలై 30,2020న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. ఇటీవ‌ల రెండో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అహ్మ‌దాబాద్, పూణేల‌లో త‌ర్వాతి షెడ్యూల్ జ‌రుపుకోనుంద‌ని నిర్మాత తెలిపారు.1823
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles