రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో కలిసి రాజమౌళి మీడియా సమావేశం

Wed,March 13, 2019 08:23 AM
rajamouli pressmeet on march 14

బాహుబ‌లి సినిమా త‌ర్వాత రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌లుగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి వార్త బ‌య‌ట‌కి రాక‌పోయే స‌రికి గాసిప్ రాయుళ్ళు వారికి న‌చ్చిన‌ట్టు అనేక పుకార్లు పుట్టిస్తున్నారు. ఎన్టీఆర్ బందిపోటుగా నటిస్తున్నారని, రామ్ చరణ్ పోలీసు అధికారని, ఇందులో బాలీవుడ్ భామ‌లు క‌థానాయిక‌లుగా న‌టిస్తార‌ని, స‌ముద్ర‌ఖ‌ని ఈ చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తాడ‌ని ఇలా అనేక రూమ‌ర్స్ పుట్టించారు. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌న హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌తో క‌లిసి మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసి అందులో ప్రాజెక్ట్ వివ‌రాల‌ని వెల్ల‌డించాల‌ని అనుకున్నాడ‌ట. ఇందుకు గాను మార్చి 14వ తేదిని ఎంచుకున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో రెండో షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. విజ‌యేంద్ర ప్ర‌సాద్ చిత్రానికి క‌థ అందిస్తుండ‌గా, కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌ల అల్యూమినియం ఫ్యాక్టరీలో మ్యూజిక్ సిట్టింగ్స్ జ‌రిగాయ‌ని కీర‌వాణి త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపిన విషయం విదిత‌మే.


2730
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles