వివాదంలో ఆర్ఆర్ఆర్ చిత్రం..!

Tue,October 22, 2019 08:56 AM

ఈ మ‌ధ్య కాలంలో సినిమా ప‌ట్టాలెక్కిందంటే చాలు ఏదో ఒక వివాదం ఆ చిత్రాన్ని చుట్టుముడుతూనే ఉంది. చారిత్రాత్మ‌క చిత్ర నేప‌థ్యంలో సినిమాలు అంటే ఇక వాటికి వివాదాలు కొత్త కాదు. ఇటీవ‌ల విడుద‌లైన సైరా, గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ చిత్రాలు కూడా అనేక వివాదాల న‌డుమ విడుద‌లై మంచి విజ‌యం సాధించాయి. ఇక ఇప్పుడు ద‌ర్శ‌క ధీర రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ కూడా వివాదాల సుడిగండంలో నిలిచింది. క‌ల్పిత‌మాధారాంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అల్లూరి పాత్ర‌ని లేదంటే ఆయ‌న క‌థ‌ని వక్రీక‌రిస్తే ఊరుకునేది లేద‌ని అల్లూరి సీతారామ రాజు సంఘం జాతీయ అధ్యక్షుడు వీరభద్ర రావు పేర్కొన్నారు. అల్లూరి, కొమ‌రం భీం స‌మావేశం యొక్క ప్రామాణిక‌త‌ను కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు.ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని జూలై 30, 2020న చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ కథానాయిక‌గా న‌టిస్తుంది. స‌ముద్ర‌ఖ‌ని, అజ‌య్ దేవ‌గణ్ వంటి ప్ర‌ముఖులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం అవుతున్నారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

2692
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles