కార్తికేయ రిసెప్ష‌న్‌లో టాలీవుడ్ సెల‌బ్స్ హంగామా

Sat,January 5, 2019 08:19 AM
Rajamouli To Throw A Big Wedding Bash For Tollywood

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లి జగపతిబాబు సోదరుడు రాం ప్రసాద్ కుమార్ కుమార్తె, గాయని పూజా ప్రసాద్‌తో ఆదివారం( డిసెంబ‌ర్ 30) సాయంత్రం రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో గల హోటల్ ఫెయిర్‌మౌంట్‌లో ఘ‌నంగా జ‌ర‌గిన సంగ‌తి తెలిసిందే. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగిన వీరి వివాహానికి ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌, రానా, నాని , నాగార్జున, రాఘ‌వేంద్ర‌రావు, అఖిల్, సుస్మితా సేన్‌ తో పాటు త‌దిత‌ర ప్ర‌ముఖులు కూడా హాజ‌ర‌య్యారు. వీరు నూత‌న జంట‌కి త‌మ ఆశీస్సులు అందించారు. ఇక జ‌న‌వ‌రి 6న హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో త‌న కుమారుడి రిసెప్ష‌న్ వేడుక జ‌రిపించ‌నున్నాడ‌ట జ‌క్కన్న‌. ఈ వేడుక‌కి టాలీవుడ్‌కి సంబంధించిన సెల‌బ్రిటీస్ అందరిని ఆహ్వానించ‌నున్నాడ‌ట‌. ఇప్ప‌టికే రిసెప్ష‌న్ వేడుక‌కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తైన‌ట్టు తెలుస్తుంది. త‌న‌యుడి పెళ్లికి సంబంధించిన కార్య‌క్ర‌మాలు అన్ని పూర్తైన త‌ర్వాత రాజ‌మౌళి మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్‌తో బిజీ కానున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.

3057
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles