సీనియర్ హీరో రాజశేఖర్ రీ ఎంట్రీ చిత్రం గరుడవేగ మంచి హిట్ కొట్టడంతో మళ్ళీ సినిమాల స్పీడ్ పెంచారు. ఇటీవల వచ్చిన కల్కి చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా అదరగొట్టిన రాజశేఖర్ తన తదుపరి చిత్రంలో డ్యూయల్ పాత్రలు పోషించనున్నట్టు తెలుస్తుంది. లాయర్‌గా, ప్రొఫెసర్‌గా రాజశేఖర్ అలరించేందుకు సిద్ధమయ్యాడట. ప్రసాద్ ల్యాబ్ అధినేత, ప్రొడ్యూసర్ రమేష్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, ఈ చిత్రం కొన్ని నెలల క్రితం తెలంగాణలో జరిగిన ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో రూపొందనుందని టాక్. రాజ్ మదిరాజు రాసిన సిరా అనే పుస్తకం నుండి ఈ కథని ప్రేరణగా తీసుకున్నారట . రాజు గతంలో పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా ఆంధ్రా పోరీ అనే సినిమాని తెరకెక్కించారు. రాజశేఖర్ తాజా ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివరాలు మరి కొద్ది రోజులలో వెల్లడించనున్నారు.