చెన్నై లీలా ప్యాలెస్‌లో ఘనంగా రజినీ కూతురు పెళ్లి

Mon,February 11, 2019 10:57 AM
rajinikanth daughter soundarya marriage at The Leela Palace hotel in Chennai

సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ చిన్న కూతురు సౌందర్య పెళ్లి ఘనంగా జరుగుతోంది. చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. నటుడు, వాణిజ్యవేత్త విశ్వగణ్ వనంగమూడితో సౌందర్య వివాహం ఇవాళ జరగనుంది. రజినీ కూతురు పెళ్లి వేడుకల సందర్భంగా లీలా ప్యాలెస్‌కు ప్రముఖులు క్యూ కట్టారు. రజినీకాంత్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ముందే ప్యాలెస్‌కు చేరుకొని పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. పెళ్లి కూతురు సౌందర్య, పెళ్లి కొడుకు విశ్వగణ్ కూడా ఇంతకు ముందే ప్యాలెస్‌కు చేరుకున్నారు. పెళ్లి బట్టలతోనే వాళ్లు ప్యాలెస్‌లో అడుగుపెట్టారు.

ఈ వివాహం సౌంద‌ర్య‌కి రెండోది కాగా, విశ్వగణ్‌కి కూడా రెండో వివాహ‌మే అంటున్నారు. ఆయ‌న ‘వంజగర్ ఉల్గామ్’ అనే సినిమాతో తమిళ తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు సినిమాల్లో సహ నటుడిగా పనిచేశారు.

2010లో వ్యాపార‌వేత్త అశ్విన్ రామ్‌కుమార్‌ను సౌంద‌ర్య పెళ్లి చేసుకున్న‌ది. ఆ త‌ర్వాత వాళ్లు 2016లో విడాకులు తీసుకున్నారు. సౌంద‌ర్య‌కు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. కొచ్చియాడ‌న్‌, వీఐపీ 2 చిత్రాల‌కు ఆమె డైర‌క్ట‌ర్‌గా చేశారు.


2836
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles