మ‌ళ్ళీ టాలీవుడ్‌లో స్పీడ్ పెంచిన ర‌కుల్‌

Thu,April 18, 2019 11:53 AM
Rakul Preet Singh paired with nithin

ఢిల్లీ డాల్‌ ర‌కుల్ ప్రీత్ సింగ్ మ‌ళ్ళీ తెలుగు సినిమాల‌తో బిజీ కానున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. 2017లో వ‌చ్చిన స్పైడ‌ర్ త‌ర్వాత ర‌కుల్ ఒక్క‌టంటే ఒక్క తెలుగు సినిమా కూడా చేయ‌లేదు. మ‌ధ్య‌లో క‌థానాయ‌కుడు చిత్రంలో గెస్ట్ రోల్ పోషించిందంతే! త‌మిళ‌, హిందీ సినిమాల‌తో మొన్న‌టి వ‌ర‌కు బిజీగా ఉన్న ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం తెలుగు సినిమాల‌కి వ‌రుస‌ డేట్స్ ఇస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే మ‌న్మ‌థుడు2 చిత్రంలో నాగ్‌తో న‌టిస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ నితిన్ స‌ర‌స‌న కూడా న‌టించేందుకు సిద్ధ‌మైందట‌.

వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమాలో నటించేందుకు రెడీ అయిన నితిన్ త్వ‌ర‌లో చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. వీటితో పాటు తనతో ఛల్‌ మోహన్‌ రంగ సినిమాను తెరకెక్కించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలోను నితిన్ సినిమా చేయ‌నున్నాడు. అయితే భీష్మ సినిమాలో నితిన్ స‌ర‌స‌న ర‌ష్మిక మంధ‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని ఇప్ప‌టికే అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు. ఇక చంద్రశేఖర్‌ ఏలేటి తెర‌కెక్కించ‌నున్న చిత్రంలో నితిన్‌తో ర‌కుల్ జోడి క‌డుతుంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ని తెలుస్తుంది. ఇక కృష్ణ చైత‌న్య- నితిన్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న చిత్రానికి 'పవర్ పేట' అనే టైటిల్ ప‌రిశీలిస్తుండ‌గా, ఇందులో ఎవ‌రిని క‌థానాయిక‌గా ఎంపిక చేస్తార‌నేది తెలియాల్సి ఉంది.

1721
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles