ఇస్మార్ట్ శంక‌ర్ స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌లో రామ్

Thu,August 1, 2019 08:49 AM
ram celebrates success with charmee team

ఎన‌ర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఇస్మార్ట్ శంక‌ర్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ళ సునామి సృష్టిస్తుంది. ఈ నేప‌థ్యంలో కొద్ది రోజులుగా చిత్ర బృందం ప‌లు ప్రాంతాల‌లో స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకుంటుంది. ముఖ్యంగా పూరీ జ‌గ‌న్నాథ్‌, ఛార్మీ, నిధి అగ‌ర్వాల్ చిత్ర స‌క్సెస్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ హీరో రామ్ పోతినేని సెల‌బ్రేష‌న్స్‌లో ఎక్క‌డ క‌నిపించ‌క‌పోయే స‌రికి అభిమానుల‌లో అనేక మొద‌ల‌య్యాయి. పూరీ జ‌గ‌న్నాథ్‌కి , రామ్‌కి ప‌డ‌డం లేద‌ని ఆ కార‌ణంగా రామ్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌లో కూడా పాల్గొన‌డం లేద‌ని ప్ర‌చారం చేశారు.

విష‌య‌మేమంటే ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం ముందుగా జూలై 12న విడుద‌ల అవుతుంద‌ని అన్నారు. దీంతో రామ్ 12 త‌ర్వాత త‌న ఫ్యామిలీతో క‌లిసి స్పెయిన్ వెళ్ల‌డానికి ప్లాన్ చేసుకున్నాడు. అన్ని బుకింగ్స్ కూడా పూర్తి చేశాడు. కాని రిలీజ్ డేట్ 18కి పోస్ట్ పోన్ అయ్యే స‌రికి రామ్ ప్ర‌మోష‌న్స్‌లో, స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన‌లేక‌పోతున్నాడు. ఫ్యామిలీతో టూర్ కాబ‌ట్టి కనీసం క్యాన్సిల్ చేసుకునే అవ‌కాశం కూడా లేద‌ట‌. ఈ కార‌ణంగానే రామ్ ఇస్మార్ట్ శంక‌ర్ ప్ర‌మోష‌న్స్ హాజ‌రు కాలేక‌పోయాడు. అయితే రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో అడుగుపెట్టిన రామ్ త‌న టీం మేట్స్‌తో క‌లిసి స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకున్నాడు. షాంపైన్ పొంగిస్తూ ఫుల్ ఎంజాయ్ చేశాడు. సక్సెస్ సెల‌బ్రేష‌న్స్‌కి సంబంధించిన వీడియోని ఛార్మి త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది.

1007
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles