మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చిన ప‌వ‌న్- చ‌ర‌ణ్ ప్రాజెక్ట్ ..!

Fri,June 21, 2019 12:08 PM
Ram Charan And Pawan Kalyan Back In News

మూడేళ్ళ క్రితం అబ్బాయి( రామ్ చ‌ర‌ణ్‌)- బాబాయి( ప‌వ‌న్ క‌ళ్యాణ్‌) ల కాంబినేష‌న్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రూపొంద‌నుంద‌ని ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ నిర్మాణంలో చ‌ర‌ణ్ హీరోగా ఈ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతుంద‌ని అన్నారు. కాని కొన్నాళ్ళుగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎలాంటి వార్త‌లు రాక‌పోవ‌డంతో, అభిమానులు సైలెంట్ అయ్యారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ మ‌రోసారి వార్త‌ల‌లోకి వ‌చ్చింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న మిత్రుడు త్రివిక్ర‌మ్‌కి మంచి క‌థ‌ని రెడీ చేయ‌మ‌ని చెప్పార‌ట‌. ఆ చిత్రం చ‌ర‌ణ్ హీరోగా రూపొందిస్తాన‌ని కూడా అన్నాడ‌ట‌. అంతా స‌వ్యంగా జరిగితే 2020లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళ‌డం ఖాయ‌మంటున్నారు. ఈ చిత్రాన్ని ప‌వ‌న్ త‌న సొంత బేన‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్‌పై రూపొందించ‌నున్నారు. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉండ‌గా, త్రివిక్ర‌మ్.. బ‌న్నీ 19వ‌చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ప‌వ‌న్ రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు.

4186
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles