వెకేష‌న్ ఎంజాయ్ చేస్తున్న రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు

Sat,May 27, 2017 12:33 PM

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ , లెక్క‌ల మాస్టారు సుకుమార్ కాంబినేష‌న్ లో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 1 నుండి రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల‌లో మొదటి షెడ్యూల్ జ‌రుపుకున్న చిత్ర యూనిట్ , ఆ త‌ర్వాత మే 9 నుండి రెండో షెడ్యూల్ జ‌రుపుకుంది.. మండే ఎండ‌ల్లో చెమ‌ట‌లు కారుస్తూ షూటింగ్ చేశారు. అయితే టీం లోని కొంద‌రు స‌భ్యులు అనారోగ్యానికి గురి కావ‌డంతో చిత్ర షూటింగ్ ని కొన్నాళ్ళు వాయిదా వేశారు. జూన్ 1 నుండి రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల‌లో ఏకధాటిగా చిత్రీక‌ర‌ణ చేయ‌డానికి ప్లాన్ చేశాడు మూవీ మేక‌ర్స్ . అయితే ఈ గ్యాప్ ని రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు బాగా స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. వెకేష‌న్ లో బ్యూటీ ఫుల్ లొకేష‌న్స్ సంద‌ర్శిస్తున్నారు . తాజాగా ఉపాస‌న త‌న ట్విట్టర్ లో అందమైన పిక్ షేర్ చేసి లాంగ్ ట్రెక్ - 7 గంట‌లు, చాలా క్యాల‌రీస్ ఎన‌ర్జీ కరిగిపోయింది అనే కామెంట్ చేసింది. రామ్ చ‌రణ్ - సుకుమార్ మూవీ ప‌ల్లెటూరి నేప‌థ్యంలో తెర‌కెక్కుతుండ‌గా, ఇందులో చెర్రీ చెవిటి వ్య‌క్తిగా క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం.1712
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles