చెర్రీ డబుల్ బొనాంజా

Tue,November 6, 2018 08:30 AM
ram charan double bonanza

రంగ‌స్థ‌లం చిత్రంతో భారీ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం బోయపాటి ద‌ర్శ‌క‌త్వంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో చిత్ర యూనిట్ అభిమానుల‌కి డ‌బుల్ బొనాంజా అందించేందుకు సిద్ధ‌మైంది. చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను మంగళవారం విడుదల చేసి 9న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక సంక్రాంతికి మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. భ‌ర‌త్ అనే నేను చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ ఈ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. స్నేహ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు . వివేక్‌ ఒబెరాయ్ ఈ సినిమాలో విల‌న్‌గా క‌నిపిస్తాడ‌ని అంటున్నారు . ఇక‌ చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ ఫేం), నవీన్‌ చంద్ర లు నటిస్తున్నారు. విన‌య విధేయ రామ అనే టైటిల్‌ని చిత్రానికి ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

2758
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles