చిరు డైలాగ్‌కు చరణ్ డబ్ స్మాష్

Tue,May 10, 2016 09:12 AM

మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రం అప్పట్లో ఏ రేంజ్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరు, విజయశాంతి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం 1991 మే 9న విడుదలైంది. నిన్నటితో ఈ చిత్రం 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ సోషల్ మీడియాలో గ్యాంగ్‌లీడర్‌ చిత్రం పై తనకున్న ఇష్టాన్ని డబ్ స్మాష్ ద్వారా తెలిపాడు. ఈ చిత్రంలో చిరు నోట వచ్చిన 'చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో ! రఫ్ ఆడించేస్తా' అనే డైలాగ్‌ను డబ్ స్మాష్ చేసి యూ ట్యూబ్ లో పోస్ట్ చేశాడు. ఇక 'జి ఏ ఎన్ జి గ్యాంగ్ గ్యాంగ్ .. అనే సాంగ్' వన్ ఆఫ్ మై ఫేవరేట్ అని ఈ సందర్భంగా తెలిపాడు. చరణ్ చేసిన డబ్ స్మాష్ వీడియో సోషల్ సైట్స్‌లో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి


2996
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles