ప్ర‌భాస్ మ‌ల్టీప్లెక్స్ ప్రారంభించ‌నున్న రామ్ చ‌రణ్

Thu,August 29, 2019 11:00 AM

టాప్ హీరోలంద‌రు ఒక‌వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు బిజినెస్ రంగంలోను త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. ముఖ్యంగా మ‌ల్టీప్లెక్స్ రంగం వైపు అంద‌రు ఆస‌క్తి చూపుతుండ‌గా, ఇప్ప‌టికే మ‌హేష్‌తో పాటు ప‌లువురు స్టార్స్ మ‌ల్టీప్లెక్స్‌ని నిర్మించారు. తాజాగా యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కూడా యూవీ క్రియేష‌న్స్‌తో క‌లిసి దేశంలోని అతి పెద్ద మ‌ల్టీప్లెక్స్‌ని నిర్మించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో ఉన్న ‘వి ఎపిక్’ అనే మ‌ల్టీప్లెక్స్ దాదాపు రూ.40 కోట్ల వ్యయంతో నిర్మిత‌మైన‌ట్టు స‌మాచారం. 7 ఎక‌రాల విస్తీర్ణంలో సువిశాలంగా ఈ మ‌ల్టీప్లెక్స్‌ని నిర్మించిన‌ట్టు తెలుస్తుంది.


మ‌రి కొద్ది నిమిషాల‌లో ‘వి ఎపిక్’ మ‌ల్టీ ప్లెక్స్ రామ్ చ‌ర‌ణ్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే అభిమానులు దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. చెర్రీకి స్వాగ‌తం ప‌లుకుతూ భారీ క‌టౌట్స్ కూడా ఏర్పాటు చేశారు. ‘వి ఎపిక్’ ప్ర‌త్యేక‌త ఏంటంటే దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా 106 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తయిన స్క్రీన్‌తో ఈ మల్టీప్లెక్స్‌ను నిర్మించారు. ఈ థియేటర్‌లో 670 సీట్ల సామర్థ్యం ఉంది. 3డీ సౌండ్‌ సిస్టమ్‌ ఈ థియేటర్‌ ప్రత్యేకత. ఇప్పటి వరకు 106 అడుగుల వెడల్పు గల భారీ స్క్రీన్‌లు ప్రపంచంలో రెండు మాత్రమే ఉన్నాయి. ఆ కోవలో ఇది మూడోదని, ఆసియాలో రెండోదని థియేటర్‌ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఇందులోనే ఒక్కోటి 180 సీట్ల సామర్థ్యంతో మరో రెండు స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు వారు తెలియజేశారు. ‘వి ఎపిక్’ లో తొలిసారి ప్ర‌భాస్ న‌టించిన సాహో చిత్రం ప్ర‌ద‌ర్శితం కానుంది.5787
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles