స్పీకర్స్ గిఫ్ట్ ఇచ్చిన ఉస్తాద్..డ్యాన్స్ చేసిన పూరీ

Mon,September 30, 2019 06:44 PM


పూరీ జగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాపీస్ వద్ద ఏ రేంజ్ లో వసూళ్లను రాబట్టిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత రామ్, పూరీ ఖాతాల్లో బ్లాక్ బ్లాస్టర్ హిట్ పడింది. తనకు మరిచిపోలేని హిట్ ను అందించిన పూరీకి హీరో రామ్ ఖరీదైన వైర్ లెస్ స్పీకర్ ను కానుకగా ఇచ్చాడు. రూ.3 లక్షలు విలువ చేసే 4500 వాట్స్ హై ఎండ్ స్పీకర్ ను పూరీకి అందజేశాడు రామ్. ఇక కొత్త స్పీకర్ లో ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్ ను ప్లే చేస్తూ, పాడుతూ స్టెప్పులు వేసి తన సంతోషాన్ని వీడియో ద్వారా తెలియజేశాడు పూరీ. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించ‌డంతో ఛార్మి, పూరీ ఒక‌రికొక‌రు కార్లని బ‌హుమ‌తులుగా ఇచ్చుకున్నారు. ఛార్మికి పూరీ బీఎండబ్యూ 7 సిరీస్‌ను గిఫ్ట్‌గా ఇవ్వగా..పూరీ జగన్నాథ్‌కు రేంజ్ రోవర్ వోగ్‌ను ఛార్మీ బహుమతిగా ఇచ్చింది.


3074
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles