నటుడిగా రాంగోపాల్ వర్మ..‘కోబ్రా’ ఫస్ట్ లుక్ ఇదే

Mon,April 8, 2019 05:24 PM

రాంగోపాల్ వర్మ ఏ నిర్ణయం తీసుకున్నా సెన్సేషనే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు తెరవెనుక ఉండి దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన సినిమాలను తీసిన వర్మ..ఇపుడు తెరపై కనిపించేందుకు రెడీ అయ్యాడు. తన పుట్టినరోజు జరుపుకోవడంపై పెద్దగా ఆసక్తి చూపించని, 57వ పుట్టినరోజుకు మాత్రం సరికొత్త నిర్ణయం తీసుకున్నాడు.


నటుడిగా ఎంట్రీ ఇస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు వర్మ. ‘నా పుట్టినరోజు సందర్భంగా..నా జీవితంలో మొదటిసారి నటుడిగా ఎంట్రీ ఇస్తున్నా. మీరు నన్ను ఆశీర్వదించకపోతే..నేను పట్టించుకోను..ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు తన ‘కోబ్రా’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా షేర్ చేశాడు. ఇది అత్యంత ప్రమాదకరమైన క్రిమినల్ బయోపిక్..ఒకవేళ అతను అరెస్టయితే, పోలీస్ డిపార్ట్ మెంట్ లో సగం మంది జైలుకెళ్లడం ఖాయమని ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఉంది. ఇక రాంగోపాల్ వర్మ ఓ చేతిలో సిగరెట్..ఇంకో చేతిలో గన్ పట్టుకుని కాస్త సీరియస్ లుక్ లో కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తున్నాడు.

కోబ్రా సినిమా రౌడీ షీటర్ నుంచి నక్సలైట్ గా..పోలీస్ కోవర్ట్ ఏజెంట్ గా..గ్యాంగ్ స్టర్ గా మారిన ఓ వ్యక్తి బయోపిక్. నేర సామ్రాజ్యాన్ని పాలించిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ లాంటి వ్యక్తుల కథ. చనిపోయే వరకు ఆ వ్యక్తి ఉనికి గురించి ఎవరికి తెలియదు అని కోబ్రా సినిమాకు సంబంధించిన వివరాలను తెలియజేశాడు వర్మ.

నటుడిగా ఎంట్రీ ఇస్తున్న వర్మకు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ శుభాకాంక్షలు తెలిపారు. మొత్తానికి ‘సర్కార్’ వర్మ అతని నిజమైన వృత్తిని గుర్తించాడు. ‘సర్కార్’ ఆల్ ది బెస్ట్. మరో పోటీ అని ట్వీట్ చేశాడు బిగ్ బీ. ఇప్పటివరకు డైరెక్టర్ గా కనిపించిన వర్మను, నటుడిగా చూడటమంటే ఆయన అభిమానులకు మాత్రం పండగే అని చెప్పొచ్చు.

1417
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles