వర్మ డైరెక్షన్ లో మెగాస్టార్ చిత్రం

Tue,April 18, 2017 06:50 PM

ఒకరు తెలుగు సినిమాకు కొత్త ట్రెండ్ ని పరిచయం చేసిన వారైతే, మరొకరు విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల గుండెల్లో మెగాస్టార్ గా నిలిచిన హీరో. త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందా అంటే అవుననే టాక్స్ వినిపిస్తున్నాయి. మరి ఇంతకు వారెవరు అంటే టాలెంటెడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్. 2002లో వీరిద్దరి కాంబినేషన్ లో దావూద్‌ ఇబ్రహీం జీవిత కథ ఆధారంగా కంపెనీ అనే చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా అప్పట్లో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మరోసారి వర్మతో కలిసి పనిచేయాలని మోహన్ లాల్ భావిస్తున్నట్టు సమాచారం.


ఒక వైపు వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడుతున్న వర్మ ఇటీవల అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో సర్కార్ అనే చిత్రాన్ని చేసాడు. ఈ మూవీ విడుదలకు రెడీ గా ఉంది. ఇక వరుస విజయాలతో మంచి జోష్ లో ఉన్న మోహన్ లాల్ ప్రస్తుతం విలన్ సినిమా చేస్తున్నాడు. ఇక తాజాగా వెయ్యి కోట్లతో తెరకెక్కనున్న మహాభారత్ మూవీలో కీలక పాత్ర పోషించనున్నట్టు తెలిపాడు మోహన్ లాల్. అయితే మోహన్ లాల్ తాజా చిత్రం విలన్ మూవీ షూటింగ్ పూర్తి కాగానే వర్మ, మోహన్ లాల్ కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ రూపొందనుందని సమాచారం.

3073
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles