నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడుతున్నా : వ‌ర్మ‌

Sun,April 28, 2019 09:46 AM

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో త‌ప్ప మిగ‌తా అంత‌టా మార్చి 29న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించింది. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు వర్మ. అయితే ఏపీలో ఎన్నికల నేపథ్యంలో సెన్సార్ బోర్డు చిత్ర విడుదలను నిలిపేసిన విషయం తెలిసిందే. అన్ని చిక్కులను దాటి ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో మే 1న లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం రోజున విజ‌యవాడ నావాటెల్ హోట‌ల్‌లో ప్రెస్‌మీట్ నిర్వ‌హిస్తున్న‌ట్టు వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నాడు.


లక్ష్మీస్ ఎన్ టి ఆర్ సినిమా ప్రెస్ మీట్ విజయవాడ నోవాటెల్ హోటల్ లో నిర్ణయించాం,కానీ ఆ హోటల్ వాళ్లకి ఎవరో వార్నింగ్‌ ఇవ్వటం మూలాన భయంతో కేన్సిల్ చేశారు. ఈ విపరీత పరిస్థితుల్లో ట్రై చేసినా అన్ని హోట్టల్స్‌, క్లబ్బుల, మేనేజిమెంట్లు, మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి భయంతో జడిసి పారిపోయారు .ఈ నేప‌థ్యంలో పైపుల రోడ్డులో ఎన్టీఆర్ స‌ర్కిల్ దగ్గర నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ పెడుతున్నా . మీడియా మిత్రులకి, ఎన్ టి ఆర్ నిజమ్తైన అభిమానులకి ,నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతీవారికీ, నిజ్జాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ‌లో పాల్గొన‌టానికి ఇదే నా బహిరంగ ఆహ్వానం అంటూ వ‌ర్మ త‌న ట్వీట్‌లో తెలిపారు. అంతేకాదు లొకేష‌న్ లింక్ కూడా ఆ ట్వీట్‌లో షేర్ చేయ‌డం విశేషం.2392
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles