చంద్ర‌బాబుని దించాడు.. జూనియ‌ర్‌ని పైకెత్తాడు

Wed,April 3, 2019 08:43 AM

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మార్చి 29న విడుద‌ల కాగా, ఈ మూవీకి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భిస్తుంది. ఏపీలో త‌ప్ప మిగ‌తా అన్ని చోట్ల విడుద‌లైన ఈ చిత్రం మంచి క‌లెక్ష‌న్స్ దూసుకెళుతుంది. ఈ చిత్రానికి కావ‌ల‌సిన దానిక‌న్నా మ‌రింత ప్ర‌చారం త‌న ట్విట్ట‌ర్ ద్వారా చేసుకుంటూ వెళుతున్నాడు వ‌ర్మ‌. ముఖ్యంగా చంద్ర‌బాబుని టార్గెట్ చేస్తూ ప‌లు ట్వీట్స్ చేస్తున్న వ‌ర్మ తాజాగా త‌న ట్వీట్‌లో నిజాయ‌తీప‌రులైన‌, అస‌లైన ఎన్టీఆర్ అభిమానులు.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చంద్ర‌బాబు పాత్ర‌ని చూశాక‌, ఆయ‌నకి ఓటేయాల‌ని కోరారు. నారా లోకేశ్ టీడీపీకి అస‌లు వార‌సుడు కాద‌న్న వ‌ర్మ‌.. ఆ పార్టీకి భ‌విష్య‌త్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌తోనే ఉంద‌ని తెలిపారు. రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్‌పై మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తుంది. వ‌ర్మ త్వ‌ర‌లో జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ని ప్రేక్ష‌కుల ముందుకు తేనున్న సంగ‌తి తెలిసిందే.4951
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles