నానా అలాంటి వాడు కాదు: వ‌ర్మ‌

Thu,October 11, 2018 11:03 AM

కాంట్ర‌వర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్ రామ్ గోపాల్ వ‌ర్మ‌. వివాదాల‌పై మొద‌ట‌గా స్పందించే వ‌ర్మ ఇండియాలో మొద‌లైన మీటూ ఉద్య‌మంపై కాస్త లేటుగా స్పందించాడు. కొద్ది రోజులుగా నానా ప‌టేక‌ర్- త‌ను శ్రీ ద‌త్తా ఉదంతం అంత‌టా సంచ‌ల‌నంగా మార‌గా, నానా ప‌టేక‌ర్ లైంగిక వేధించాడంటే నేను న‌మ్మ‌ను. త‌నుశ్రీ ద‌త్తా ఆయ‌న విష‌యంలో పొర‌ప‌డి ఉంటుందేమో అంటూ తొమ్మిది నిమిషాల వీడియో ద్వారా నానాపై త‌న ఒపీనియ‌న్ తెలియ‌జేశాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.


నానా ప‌టేక‌ర్‌తో ఎన్నో ఏళ్ళు ప‌ని చేసిన నాకు ఆయ‌న ఒక షార్ట్ టెంప‌ర్ వ్య‌క్తిగా మాత్ర‌మే తెలుసు. ఒక‌రిని వేధించే వ్య‌క్తి అని మాత్రం నేను అనుకోవ‌డం లేదు. ముంబైకి వెళ్లిన తొలినాళ్ళ‌లో నానా ప‌టేక‌ర్‌కి ఫోన్ చేసాను. మ‌నం సాధారణంగా హ‌లో అంటాం. కాని ఆయ‌న బోలో అంటూ మొద‌లు పెట్టాడు. సార్ నా పేరు రామ్ గోపాల్ వ‌ర్మ‌. సినిమా ద‌ర్శ‌కుడిని . హైద‌రాబాద్ నుండి మిమ్మ‌ల్ని క‌ల‌వ‌డానికి వచ్చాను అని చెప్పాను. దీంతో ఆయ‌న వెంటనే ఇంటికి వ‌చ్చేయ్ అని అన్నారు.

నానా పటేకర్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ వ్యక్తి అని వర్మ కితాబిచ్చారు. త‌న‌ని క‌లిసి క‌థ చెబుతున్న స‌మ‌యంలో నానా వ‌ర్మ‌ని టీ తాగుతావా అని అడిగాడ‌ట‌. తాగుతాన‌ని చెప్ప‌గానే కిచెన్ చూపించి నాక్కూడా టీ తీసుకురా అని ప‌ని చెప్పార‌ట‌. వెంట‌నే నాకు టీ చేయ‌డం రాద‌ని నానాకి చెప్పాను. ఇంత వ‌య‌స్సు వ‌చ్చింది. టీ చేయ‌డం రాక‌పోవ‌డం ఏంటి ? మీ అమ్మకు ఫోన్ కలుపు’ అంటూ గద్గ‌ద స్వ‌రంతో ఆయ‌న అన్నార‌ని వ‌ర్మ చెప్పాడు. త‌న త‌ల్లితో కూడా నానా మాట్లాడ‌ని వ‌ర్మ చెప్పుకొచ్చాడు. పూణేలో జ‌రిగిన ఓ ఇన్సిడెంట్ గురించి వివ‌రించిన వ‌ర్మ త‌న మ‌న‌స్త‌త్వం ఎలాంటిదో వివ‌రించాడు. నానాపటేకర్ ను అర్థం చేసుకుంటే ఆయన్ను అందరూ గౌరవిస్తారని చెప్పారు.

నానా ప‌టేక‌ర్ జీవితంలో లైంగికంగా ఎవ‌రిని వేధించి ఉండ‌డు. ఆయ‌న గురించి తెలియ‌ని వ్య‌క్తులు త‌ప్పుగా అర్దం చేసుకొని ఉంటారు అంటూ వ‌ర్మ త‌న‌దైన స్టైల్‌లో నానా ప‌టేక‌ర్‌కి పాజిట‌వ్ స‌ర్టిఫికెట్ ఇచ్చాడు. న‌టీన‌టుల‌పై జ‌రిగిన లైంగిక వేధింపుల‌కి వ్య‌తిరేఖంగా ఇండియా మొత్తం మీటూ ఉద్య‌మం ఉదృతంగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. మీ టూ హ్యాష్ ట్యాగ్‌తో చాలా మంది సెల‌బ్రిటీలు త‌మ‌కి ఎదురైన అనుభ‌వాల‌ని సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటున్నారు.2009
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles