సైకిల్ టైర్ పంక్చర్ అయింది..అందుకే కారులో వచ్చాం: వర్మ

Mon,May 27, 2019 02:01 PM

పశ్చిమ గోదావరి: సైకిల్ టైర్ పంక్చర్ అయింది..అందుకే కారులో వచ్చామని దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తెలుగుదేశం పార్టీపై సెటైర్లు వేశాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో వర్మ మాట్లాడుతూ.. నిజాలు బయటపడతాయనే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలను అడ్డుకున్నారు. రైతుల కష్టాలు నాకు తెలియదు, నేనెప్పుడూ పొలం వెళ్లలేదు. రాజకీయాల్లోకి రాను, ప్రజలకు సేవచేసే ఉద్దేశం నాకు లేదు. త్వరలో 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా తీయబోతున్నాను. అని వర్మ ప్రకటించారు. ఆయన దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఈ నెల 31న ఆంధ్రప్రదేశ్‌లో విడుదలకానున్న విష‌యం తెలిసిందే.

5152
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles