ఓ ఊపు ఊపుతున్న రాములో.. రాములా సాంగ్

Sun,October 27, 2019 08:35 AM

అల్లు అర్జున్-త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘అల‌..వైకుంఠ‌పుర‌ములో’. సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రం నుండి రాములో రాములా నన్నాగమ్ చేసిందిరో అనే సాంగ్ వీడియో విడుద‌ల చేశారు. దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌లైన ఫుల్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. కాసర్ల శ్యామ్ ర‌చించిన ఈ గీతాన్ని అనురాగ్ కుల‌క‌ర్ణి, మంగ్లీ ఆల‌పించారు. థ‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. ఈ పాట యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది. గ‌తంలో ఈ చిత్రం నుండి విడుద‌లైన సామజవరగమన పాట సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో వ్యూస్ ను సాధించిన సంగ‌తి తెలిసిందే. . ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్‌ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

2567
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles