'బిగ్‌బాస్‌' హోస్ట్‌గా రమ్యకృష్ణ

Sat,August 31, 2019 06:00 PM
Ramyakrishnan steps into host Nagarjunas shoes for the weekend episode

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-3 ఆరో వారాంతంలో ప్రముఖ సినీనటి రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. బాహుబలి చిత్రంలో రాజమాత శివగామి పాత్రలో అలరించిన రమ్యకృష్ణ బిగ్‌బాస్‌ హౌస్‌లో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. తన పుట్టినరోజును సెలబ్రేట్‌ చేసుకునేందుకు కుటుంబసభ్యులతో కలిసి నాగార్జున విదేశాలకు వెళ్లడంతో నాగ్‌ స్థానంలో ఈ వీకెండ్‌ స్పెషల్‌ గెస్ట్‌గా రమ్యకృష్ణ వచ్చేస్తున్నారు. రాజు దూరంగా ఉన్నప్పుడు రాణి వచ్చిందంటూ రిలీజ్‌ చేసిన ప్రోమో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. బాహుబలి చిత్రంలోని పాపులర్‌ డైలాగ్‌ ఇదే నా మాట.. నా మాటే శాసనం అని ఈ ప్రోమోలో రమ్యకృష్ణ చెప్పిన డైలాగ్‌తో బిగ్‌బాస్‌ నిర్వాహకులు తాజాగా వీడియో విడుదల చేశారు. శని, ఆదివారం ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులు, రమ్యకృష్ణల మధ్య ఆసక్తికర సంభాషణలు, గేమ్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎలా ఉంటుందో చూడాలి.

3074
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles