నాకు అంత సీన్ లేదు.. : రానా ద‌గ్గుబాటి

Sat,February 23, 2019 01:44 PM

బాహుబ‌లి సినిమాతో ప్ర‌పంచఖ్యాతి పొందిన న‌టుడు రానా. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో ప‌లు క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నాడు రానా. అయితే ఇటీవ‌ల ఓ ఆంగ్ల‌ప‌త్రిక విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అల్లు అర్జున్, రానాల‌లో ఎవ‌రు గల్లీబాయ్ తెలుగు రీమేక్‌కి స‌రిపోతార‌ని ఓటింగ్ పెట్టింది. దీనిపై నెటిజ‌న్స్ త‌మ అభిమాన హీరోల‌కి ఓటింగ్స్ వేశారు. అయితే ఈ అంశంపై రానా స్పందిస్తూ ‘నన్ను వదిలేయండి.. నాకు అంత నైపుణ్యం లేదు’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను షేర్‌ చేశారు. గ‌తంలో గ‌ల్లీబాయ్ తెలుగు రీమేక్‌లో సాయిధ‌ర‌మ్ న‌టించ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్ర తెలుగు రీమేక్స్‌ని అల్లు అర‌వింద్ కొనుగోలు చేశాడ‌ని టాక్.


ర‌ణ‌వీర్ సింగ్‌, అలియా భ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం గ‌ల్లీబాయ్. జోయా అక్త‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల అయి మంచి విజ‌యం సాధించింది. ఈ చిత్రానికి ఇండియ‌న్ క్రిటిక్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం జ‌ర్న‌లిస్ట్స్ నుండి కూడా ప్ర‌శంస‌లు ల‌భించాయి. ముంబై మురికి వాడల్లో పెరిగిన ఓ యువకుడు.. ఇండియాలోనే టాప్ ర్యాపర్‌గా ఎదిగిన తీరును ఈ మూవీలో చూపించారు. మేరీ గల్లీ, రూట్స్‌లాంటి హిట్ ర్యాప్ సాంగ్స్ సృష్టికర్త అయిన ఇండియన్ ర్యాపర్ డివైన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. కల్కీ కొచ్లిన్‌, విజయ్‌ రాజ్‌, విజయ్‌ వర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, టైగర్‌ బేబీ ప్రొడక్షన్స్‌ సంస్థలు నిర్మించాయి.

4679
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles