భ‌ళ్ళాల‌దేవ పాత్ర త‌ర్వాత మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో..

Sat,September 28, 2019 09:47 AM

బాహుబ‌లి చిత్రంలో భ‌ళ్ళాల‌దేవ పాత్ర‌తో దేశ వ్యాప్తంగా అశేష ఆద‌ర‌ణ పొందాడు రానా ద‌గ్గుబాటి. ఇప్పుడు మ‌రో ప‌వ‌ర్ పాత్ర‌తో అలరించేందుకు సిద్ధ‌మ‌య్యాడు రానా. హౌస్‌ఫుల్ ఫ్రాంచైజ్‌లో భాగంగా హౌస్‌ఫుల్ 4 చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌కు జోడీగా కృతిసనన్, రితేశ్ దేశ్‌ముఖ్‌కు జోడీగా పూజా హెగ్డే, బాబీ డియోల్‌కు జోడీగా కృతి కర్బంద నటించారు. ఫర్హాద్ సంఝీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పునర్జన్మ‌ల నేపథ్యంలో సాగుతుంద‌ట‌. 1419, 2019 మధ్య కాలంలో సాగే ఈ కథలో బోలెడన్ని వినోదాలు ఉంటాయని తెలుస్తుంది. ఇందులో రానా కాళ‌కేయ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు.


2015లో వ‌చ్చిన బేబీ చిత్రంతో హిందీ ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు రానా. ఆ త‌ర్వాత బాహుబ‌లి ఫ్రాంచైజ్ చిత్రాల‌తో అల‌రించాడు. ఇప్పుడు హౌజ్‌ఫుల్ 4 అనే కామెడీ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా హౌజ్‌ఫుల్ 4 చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇందులో రానా గెట‌ప్ ప్రేక్ష‌కుల‌కి గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. 1419 కాలం నాటి రాజ్యాన్ని కూల్చే పాత్ర‌ని రానా పోషిస్తున్నాడు. ఎంతో క్రూరంగా క‌నిపిస్తూ త‌న పాత్ర‌పై ఆస‌క్తి క‌లిగిస్తున్నాడు. ఈ సినిమాతో రానాకి హిందీలో మ‌రింత క్రేజ్ పెర‌గ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. తెలుగులో విరాట ప‌ర్వం అనే సినిమాతో రానా బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే.

6833
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles