పార్టీకి ఎందుకు పిల‌వ‌లేద‌ని ప్ర‌శ్నించిన రానా

Sat,June 30, 2018 10:17 AM
rana shares party pic

పెళ్లి చూపులు ఫేం తరుణ్‌భాస్కర్ తెరకెక్కించిన‌ తాజా చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది?’. కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన‌ పెళ్లి చూపులు మంచి హిట్ కావ‌డంతో ఆయ‌న తాజా చిత్రంపై చాలా ఆస‌క్తి నెల‌కొంది. షార్ట్ ఫిలిం తీయాలనుకునే నలుగురు యువకుల (స్నేహితులు)చుట్టూ తిరిగే కథాంశంతో ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా తెర‌కెక్క‌గా ఇందులో విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్, వెంకటేశ్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి కీలక పాత్రల్లో నటించారు . సురేశ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం నిన్న గ్రాండ్‌లో విడుద‌లైంది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావ‌డంతో చిత్ర యూనిట్ ఓ హోట‌ల్‌లో పార్టీ చేసుకుంది. సురేష్ బాబుతో పాటు తరుణ్ భాస్కర్, చిత్ర పాత్ర ధారులు విష్వక్సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, కే వెంకటేష్, అనీషా అంబ్రోస్, అభినవ్, సిమ్రన్ చౌదవి తదిత‌రులు పార్టీలో సంద‌డి చేసారు. ఈ సంద‌ర్భంగా దిగిన పిక్‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పిక్ రానా కంట ప‌డ‌డంతో అదే ఫోటోని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేస్తూ పార్టీకి నన్ను ఎందుకు పిల‌వ‌లేదంటూ ప్ర‌శ్నించాడు. ఈ పోస్ట్ ప్ర‌స్తుతం వైర‌ల్ అయింది.


3506
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles