సూప‌ర్ హిట్ జోడీ మ‌రోసారి సంద‌డి చేయడం ఖాయ‌మ‌ట‌..!

Sun,April 28, 2019 08:01 AM
Ranbir Kapoor , Deepika Padukone combination comes on board

చాక్లెట్ బాయ్ ర‌ణ్‌బీర్ క‌పూర్, ప‌ద్మావ‌త్ హీరోయిన్‌ దీపికా ప‌దుకొణేలు కొన్నాళ్ళ‌పాటు ప్రేమాయ‌ణంలో ఉండ‌గా ప‌లు కార‌ణాల వ‌ల‌న వారి ప్రేమ‌కి బ్రేక్ ప‌డింది. దీంతో నాలుగేళ్ళుగా వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమాలు కూడా రాలేదు. అయితే వీరిద్ద‌రు క‌లిసి మ‌రో ప్రాజెక్ట్ చేయ‌బోతున్నార‌నే వార్త ఇటీవ‌ల‌ హాట్ టాపిక్‌గా మారింది. లవ్‌ రంజన్‌ దర్శకత్వంలో ర‌ణ్‌బీర్ క‌పూర్‌, దీపికా చిత్రం నుండి రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ ప్రాజెక్ట్ మ‌రి కొద్ది రోజుల‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ట‌. డిసెంబ‌ర్ 2020లో ఈ చిత్రం థియేట‌ర్స్‌లోకి రానుంద‌ని అంటున్నారు. టీ సిరీస్‌, ల‌వ్ ఫిలింస్‌తో క‌లిసి భూష‌ణ్ కుమార్ ఈ సినిమాని నిర్మించ‌నున్నాడు. ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కైతే ఎలాంటి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రాలేదు.

మరో ప్రాజెక్ట్‌కి ఈ క్రేజీ జంట గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని తాజా స‌మాచారం. అనురాగ్ బ‌సు ద‌ర్శ‌క‌త్వంలో రొమాంటిక్ చిత్రం చేయ‌నున్నార‌ని అంటున్నారు. ఇందులో ర‌ణ్‌బీర్‌, దీపిక ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌నున్నార‌ట‌. ఇటీవ‌ల ఈ జంట ఓ ప్ర‌క‌ట‌న‌లో న‌టించారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. నాలుగేళ్ళ త‌ర్వాత ఈ జంట ఇలా క‌లిసిక‌ట్టుగా క‌నిపించ‌డంతో అభిమానుల‌లో ఆనందం వెల్లివిరిసింది. 2008లో వచ్చిన బ‌చ్నా ఏ హ‌సీనో అనే చిత్రంలో తొలిసారి ర‌ణ్‌బీర్ క‌పూర్‌, దీపికా కలిసి న‌టించ‌గా ఆ త‌ర్వాత యే జ‌వానీ హై దీవాని చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చారు. 2013లో ఈ చిత్రం విడుద‌లైంది. ఇక 2015లో త‌మాషా అనే చిత్రంతో అల‌రించారు. ర‌ణ్‌బీర్ క‌పూర్ ప్ర‌స్తుతం బ్ర‌హ్మాస్త్రా చిత్రంతో బిజీగా ఉండ‌గా, దీపిక మేఘ‌నా గుల్జార్ చ‌పాక్ అనే చిత్రం చేస్తుంది.

2872
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles