అలియా వ‌లన వాయిదా ప‌డ్డ ర‌ణ్‌బీర్ చిత్రం ..!

Tue,June 18, 2019 12:07 PM
Ranbir Will Have Only One Movie Release In 2020

బాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ అలియా భ‌ట్‌, ర‌ణ్‌బీర్ కాంబినేష‌న్‌లో బ్ర‌హ్మాస్త్రా అనే క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. చాలా రోజుల పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ చిత్రం రీసెంట్‌గా సెట్స్ పైకి వెళ్ళింది. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్‌పై క‌ర‌ణ్ జోహార్ అత్యంత బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. శివ పాత్ర‌లో ర‌ణ్‌బీర్ న‌టిస్తుండ‌గా, ఇషా పాత్ర‌లో అలియా క‌నువిందు చేయ‌నుంది. మూడు భాగాలుగా ఈ ఫాంట‌సీ ఎంట‌ర్‌టైన‌ర్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌ణ్‌బీర్ క‌పూర్‌, నాగార్జున అక్కినేని, అలియా భ‌ట్‌, మౌనీ రాయ్ ముఖ్య పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. అయితే ఇటీవ‌ల అలియా భ‌ట్‌కి ఉద‌ర సంబంధిత స‌మ‌స్య రావ‌డంతో షూటింగ్‌ని నిలిపివేశారు. దీంతో బ్ర‌హ్మాస్త్రా చిత్ర రిలీజ్ మ‌రి కొద్ది రోజులు ముందుకు జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అయితే అనుకోకుండా బ్ర‌హ్మాస్త్రా చిత్ర షూటింగ్ ర‌ద్ధు కావ‌డం వ‌ల‌న ర‌ణ్‌బీర్ ఈ చిత్రానికి మ‌రి కొన్ని రోజుల కాల్షీట్స్ కేటాయించాల్సి ఉంద‌ట‌. దీని వ‌ల‌న 2020లో విడుద‌ల కావ‌ల‌సిన ర‌ణ్‌బీర్ షంషెరా చిత్రం 2021లో విడుద‌ల కానుంద‌ని అంటున్నారు. క‌ర‌ణ్ మ‌ల్హోత్రా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ర‌ణ్‌బీర్ గ‌త ఏడాది సంజు చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన విష‌యం విదిత‌మే.

1271
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles