క‌పిల్ దేవ్ పర్య‌వేక్ష‌ణ‌లో ట్రైనింగ్ అవుతున్న ర‌ణ్‌వీర్- వీడియో

Fri,April 19, 2019 11:12 AM
Ranveer Singh 83 prep up video

లెజండ‌రీ క్రికెట‌ర్ క‌పిల్ దేవ్ జీవిత నేప‌థ్యంలో 83 అనే చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. క‌బీర్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ణ‌వీర్ సింగ్ .. క‌పిల్ దేవ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. క్రికెటర్ కృష్ణ‌మాచారి శ్రీకాంత్ పాత్ర‌లో త‌మిళ న‌టుడు జీవా న‌టిస్తున్నాడు. 1983 వరల్డ్‌కప్ ఫైనల్లో అప్పటి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ టీమ్ సక్సెస్ స్టోరీ ఆధారంగా 83 మూవీ రూపొందుతుంది. హిందీ, తెలుగుతో పాటు పలు భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్‌కి కోచ్ గా నటించనున్నారు.

2020 ఏప్రిల్ 10న‌ గుడ్ ఫ్రైడే రోజు క‌పిల్ దేవ్ బ‌యోపిక్ చిత్రంని విడుద‌ల కానున్న విష‌యం విదిత‌మే. అయితే నేడు గుడ్ ఫ్రైడే కావ‌డంతో ఈ సంద‌ర్భంగా చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్న న‌టులు చేస్తున్న ప్రాక్టీస్‌కి సంబంధించిన వీడియో విడుదల చేశారు. ఇందులో ర‌ణ్‌వీర్‌కి ద‌గ్గ‌రుండి మ‌రీ క‌పిల్ ట్రైనింగ్ ఇస్తుండ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ వీడియో నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. మ‌ధు మంతెన‌, విష్ణు ఇందూరి, ఖాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పంక‌జ్ త్రిపాఠి, తాహిర్ ఆజ్ భాసిన్‌, స‌కీబ్ స‌లీమ్, చిరాగ్ ప‌టిల్‌, అదినాథ్ కొఠారే, ధైర్య క‌ర్వా, దిన‌క‌ర్ శ‌ర్మ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.

1453
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles