ట్రైనింగ్ పూర్తి.. ఇక షూటింగ్‌తో బిజీ

Fri,May 17, 2019 11:57 AM

బాలీవుడ్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ లెజండ‌రీ క్రికెట‌ర్ క‌పిల్ దేవ్ బ‌యోపిక్‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. 83 అనే టైటిల్‌తో క‌బీర్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో క‌పిల్ దేవ్‌గా ర‌ణ్‌బీర్ న‌టిస్తున్నాడు. క్రికెటర్ కృష్ణ‌మాచారి శ్రీకాంత్ పాత్ర‌లో త‌మిళ న‌టుడు జీవా న‌టిస్తున్నాడు. 1983 వరల్డ్‌కప్ ఫైనల్లో అప్పటి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ టీమ్ సక్సెస్ స్టోరీ ఆధారంగా 83 మూవీ రూపొందుతుంది. హిందీ, తెలుగుతో పాటు పలు భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్‌కి కోచ్ గా నటించనున్నారు.


కొద్ది రోజులుగా చిత్ర బృందం ప్ర‌ముఖ క్రికెట‌ర్స్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో శిక్ష‌ణ తీసుకుంది. రీసెంట్‌గా ట్రైనింగ్ పూర్తి కావ‌డంతో చిత్రాన్ని జూన్ 5న స్కాంట్లాండ్‌లోని గ్లాస్గోలో చిత్రీక‌రించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. స్కూటిష్ పోర్ట్ సిటీలోని లోక‌ల్ క్రికెట్ క్ల‌బ్‌లో వారం పాటు షూటింగ్ జ‌రిపిన త‌ర్వాత‌, లండ‌న్‌లోని డ‌ల్విచ్ కాలేజ్‌, ఎడిన్‌బ‌ర్గ్ క్రికెట్ క్ల‌బ్‌, కెంట్‌లోని నెవిల్ గ్రౌండ్‌, ఓవ‌ల్ క్రికెట్ గ్రౌండ్‌లో చిత్రీక‌ర‌ణ జ‌ర‌పనున్నారు. 2020 ఏప్రిల్ 10న‌ గుడ్ ఫ్రైడే రోజు క‌పిల్ దేవ్ బ‌యోపిక్ చిత్రంని విడుద‌ల చేయ‌నున్నారు. మ‌ధు మంతెన‌, విష్ణు ఇందూరి, ఖాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పంక‌జ్ త్రిపాఠి, తాహిర్ ఆజ్ భాసిన్‌, స‌కీబ్ స‌లీమ్, చిరాగ్ ప‌టిల్‌, అదినాథ్ కొఠారే, ధైర్య క‌ర్వా, దిన‌క‌ర్ శ‌ర్మ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు

1722
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles