అభిమానులపైకి దూకిన హీరో.. పలువురికి గాయాలు.. వీడియో

Tue,February 5, 2019 03:30 PM

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ గురించి తెలుసు కదా. ఈ ఎనర్జిటిక్ హీరో ఎక్కడికెళ్లినా తన చిలిపి చేష్టలతో వార్తల్లో నిలుస్తాడు. దీపికా పదుకోన్‌తో పెళ్లి తర్వాత కూడా రణ్‌వీర్‌లో ఏ మార్పూ రాలేదు. తాజాగా లాక్మె ఫ్యాషన్ వీక్‌లో భాగంగా రణ్‌వీర్ చేసిన ఓ పని కొందరు అభిమానులను గాయపరిచింది. ఈ గల్లీ బాయ్ హీరో.. ఆ సినిమాలోని అప్నా టైమ్ ఆయేగా పాట పాడుతూ.. సడెన్‌గా స్టేజ్ కింద ఉన్న ఫ్యాన్స్‌పైకి దూకాడు. ఈ పరిణామాన్ని ఊహించని అభిమానులు షాక్ తిన్నారు. అతడు సడెన్‌గా పైకి దూకడంతో కొందరు కిందపడి గాయాల పాలయ్యారు. అతన్ని తమ మొబైల్ ఫోన్లలో బంధించే పనిలో బిజీగా ఉన్న ఫ్యాన్స్ రణ్‌వీర్ అలా చేస్తాడని ఊహించలేదు. ఆ అభిమానుల్లో కొందరు యువతులు కూడా ఉన్నారు. వాళ్లు కిందపడిన ఫొటోలను కొన్ని పేపర్లు ప్రముఖంగా ప్రచురించాయి. రణ్‌వీర్ చర్యను కొందరు అభిమానులు ఖండించారు. రణ్‌వీర్ ఇప్పటికైనా కాస్త ఎదుగు.. పిల్ల చేష్టలు మానుకో అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశాడు.8360
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles