మంచోడికి వీడ్కోలు ప‌ల‌క‌నున్న ఇంటి స‌భ్యులు ?

Sat,September 28, 2019 01:37 PM

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3 ప‌దో వారం ఎలిమినేష‌న్ టైం ద‌గ్గ‌ర ప‌డింది. ప్ర‌స్తుతం నామినేష‌న్‌లో బాబా భాస్క‌ర్, వ‌రుణ్ సందేశ్‌, శ్రీముఖి, ర‌వి కృష్ణ ఉండ‌గా వీరిలో ఒక‌రు ఆదివారం ఎలిమినేట్ కానున్నారు. ఈ రోజు ఒక‌రు లేదా ఇద్ద‌రు సేవ్ అయ్యే అవ‌కాశం కనిపిస్తుంది. అయితే ఎలిమినేష‌న్ విష‌యానికి వ‌స్తే నామినేష‌న్‌లో ఉన్న న‌లుగురిలో టీవీ యాక్ట‌ర్ ర‌వికృష్ణ కాస్త వీక్ అని చెప్ప‌వ‌చ్చు. మొద‌టి నుండి మంచోడు మంచోడు ముద్ర వేసుకుంటూ నెట్టుకొచ్చిన ర‌వి గేమ్ ప‌రంగా కాస్త వీక్ అనే అంటున్నారు నెటిజ‌న్స్. ఈ వారం ర‌వికృష్ణ‌నే ఇంటి నుండి బ‌య‌ట‌కి వెళ‌తాడ‌ని నెటిజ‌న్స్ బ‌ల్ల‌గుద్ది చెబుతున్నారు.


ర‌వికృష్ణ‌కి కూడా తాను ఎలిమినేట్ అవుతాడ‌నే భ‌యం లోలోప‌ల ఉండ‌డంతో కెప్టెన్ టాస్క్‌లో కెప్టెన్ అయ్యేందుకు అంద‌రిని చాలా రిక్వెస్ట్ చేశాడు. కాని ఎవ‌రు క‌రుణించ‌క‌పోవడంతో కెప్టెన్ టాస్క్ పొందే అవకాశాన్ని మిస్ అయ్యాడు. ఇక‌ ర‌వి కృష్ణ‌కే కాదు ఆయ‌న బెస్ట్ ఫ్రెండ్ అలీ రాజాకి కూడా ర‌వినే ఎలిమినేట్ అవుతాడ‌నే ఆలోచ‌న మ‌న‌సులో ఉంది. అందుకే తోటి ఇంటి స‌భ్యుల‌తో ర‌విని కెప్టెన్ చేద్దాం. రెండు రోజులైన ఇంటి కెప్టెన్‌గా ఉండి వెళ‌తాడు అని చెప్పుకొచ్చాడు. ఏదేమైన నెటిజ‌న్స్ అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచ‌న‌లు ప‌రిశీలిస్తే ఈ వారం ఇంటి నుండి వెళ్లిపోయేది ర‌వికృష్ణ అని గ‌ట్టిగా చెబుతున్నారు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో.

17023
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles