ప‌వ‌న్ ప్రాజెక్ట్ ర‌వితేజ ద‌గ్గ‌ర‌కి ..!

Wed,October 31, 2018 09:28 AM
ravi teja did pawans project in future

వ‌రుస హిట్స్‌తో జెట్‌లా దూసుకెళుతున్న ప్రొడ‌క్ష‌న్ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్‌. శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్‌’, ‘రంగస్థలం’.. ఇలా వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్‌ కొట్టిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు త‌న సంస్థ నుండి నాలుగో చిత్రం ‘సవ్యసాచి’ని న‌వంబ‌ర్ 2న విడుద‌ల చేయ‌నుంది. ఈ మూవీ త‌ర్వాత అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని అనే చిత్రం రిలీజ్‌కి సిద్ధం చేయ‌నుంది. అయితే తాజాగా ఈ సంస్థ‌కి చెందిన నిర్మాత‌లు ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ .. ప‌వ‌న్‌తో సినిమా చేద్దామనుకున్నాం. ఆయన రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల కుదర్లేదు. దీంతో ఆ ప్రాజెక్ట్‌ని ర‌వితేజ‌తో చేయాల‌నుకుంటున్నాం అని అన్నారు.

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తమిళంలో హిట్ అయిన 'తెరి'కి రీమేక్ చేయాల‌ని మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ భావించింది. కానీ రాజ‌కీయాల‌తో బిజీ వ‌ల‌న ప‌వ‌న్ ఆ ప్రాజెక్ట్ ఆయన చేయనన్నారు. దాంతో ఆ కథను రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా మార్చి చేస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన విష‌యాలు మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ వెల్ల‌డించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. గ‌తంలో ప‌వ‌న్ చేయాల్సిన ప‌లు ప్రాజెక్టులు ర‌వితేజ ద‌గ్గ‌ర‌కి వెళ్ల‌గా, అవి ఎంత భారీ విజ‌యం సాధించాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. ఇదిలా ఉంటే మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ సాయిధరమ్‌ తేజ్‌తో ‘చిత్రలహరి’ చేయ‌నుండ‌గా, కోటి రూపాయల లోపు బడ్జెట్ తో కూడా ఒక సినిమా ప్లాన్ చేశారు. ఈ సినిమా ద్వారా రితేష్ అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయమ‌వ‌నున్నాడ‌ట‌. వ‌చ్చే ఏడాది వారు చేయ‌నున్న 5 ప్రాజెక్టుల వివ‌రాలు కూడా త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నుంద‌ట ఆ సంస్థ‌.

3205
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles