వినాయ‌క‌చ‌వితికి మాస్ రాజా స‌ర్‌ప్రైజింగ్ గిఫ్ట్

Wed,August 28, 2019 10:49 AM

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజా. వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంకి సంబంధించి ఇటీవ‌ల ప్రీ లుక్ విడుద‌ల చేశారు. ఫ‌స్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, సెప్టెంబ‌ర్ 2న వినాయ‌క చవితి సంద‌ర్భంగా ర‌వితేజ లుక్ రివీల్ చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. చిత్రాన్ని ఏడాది చివ‌రలో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల ర‌వితేజ యంగ్ లుక్ అంటూ ఓ ఫోటో చ‌క్క‌ర్లు కొట్ట‌గా, అది సినిమాకి సంబంధించిన లుక్ కాద‌ని ద‌ర్శ‌కుడు క్లారిటీ ఇచ్చాడు. డిస్కో రాజా చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు. ‘ఇస్మార్ట్ శంక‌ర్ ’ ఫేమ్‌ నభా నటేశ్‌ను ఓ నాయికగా, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ను మరో నాయికగా న‌టిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ స్వరకర్త.

1085
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles