డిస్కో రాజా నుండి ర‌వితేజ లుక్ విడుద‌ల‌

Thu,August 15, 2019 09:43 AM

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న తాజా చిత్రం డిస్కో రాజా. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ చిత్రాల ద‌ర్శ‌కుడు వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మించ‌నున్నారు. ‘ఇస్మార్ట్ శంక‌ర్ ’ ఫేమ్‌ నభా నటేశ్‌ను ఓ నాయికగా, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ను మరో నాయికగా ఎంపిక చేశారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. తమన్‌ స్వరకర్త. అయితే ఈ చిత్రం కొంత భాగం చెన్నై నేప‌థ్యంలో సాగనున్న‌నేప‌థ్యంలో త‌మిళ స్టార్ బాబీ సింహాని ప్ర‌తి నాయ‌కుడిగా ఎంపిక చేశార‌ని తెలుస్తుంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర ప్రీ లుక్ కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఇందులో ర‌వితేజ పూర్తి లుక్ రివీల్ చేయ‌లేదు. అతి త్వ‌ర‌లో ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తామ‌ని మేక‌ర్స్ అంటున్నారు.

1092
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles